Does your child have a speech delay (Telugu)
మీ పిల్లలకు ఇంకా మాటలు రావడం లేదా స్పీచ్ ఆలస్యం – తల్లిదండ్రులందరూ తమ పిల్లల తొలి పలుకులు వీలైనంత త్వరగా వినాలని కోరుకుంటారు. పిల్లలు పెరిగేకొద్దీ చిట్టిపొట్టి మాటలతొ మాటలు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. కానీ చాలా మంది పిల్లలు తమ వయస్సులో ఉన్న పిల్లల కంటే ఆలస్యంగా మాట్లాడటం జరుగుతుంది. భారతదేశంలో ప్రతి 10 మంది పిల్లలలో ఒకరికి మాటలు రావడం ఆలస్యం అవుతాయి. దినినే స్పీచ్ డిలే అంటారు. స్పీచ్ డిలేకి చాలా కారణాలున్నాయి. అవి ఏమిటో ఈ వ్యాసంలో తెలుసుకుందాం. అసలు స్పీచ్ డిలే అంటె ఏమిటి? సాధారణంగా రెండేళ్ల పిల్లలు దాదాపు 50 పదాలు మాట్లాడగలరు మరియు రెండు నుండి మూడు పదాల వాక్యాలను కూడా ఉపయోగించగలరు. మూడు సంవత్సరాల నాటికి పిల్లలకు సుమారు 1000 పదాలు తెలిసుంటాయి మరియు మూడు నుండి నాలుగు పదాల వాక్యాలను మాట్లాడటానికి ప్రయత్నించడం ప్రారంభిస్తారు. ఏ పరిస్థితులవల్లనైనా, పిల్లలు తమ భాషలో పరిణామం చెందకపొతే వాళ్ళకి మాటలు రావడం ఆలస్యమయ్యాయని అంటే స్పీచ్ డిలే ఉంది అని చెప్పవచ్చు. ఇది కొన్నిసార్లు వినికిడి సమస్య లేదా నాడీ సంబంధిత సమస్యల వల్ల కూడా కావచ్చు. ఏ కారణాల వల్ల స్పీచ్ డిలే వస్తుంది? గర్భధారణ సమయంలో తల్లి శారీరక మరియు మానసిక ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నా.. పిల్లలు నెలలు నిండకుండానే పుట్టినా.. పుట్టినప్పుడు ఆలస్యంగా ఏడ్చినా.. నరాల సమస్య ఉన్నా.. పిల్లల మెదడు గాయం అయినా.. వినికిడి లోపం ఉన్న పిల్లలు కూడా మాట్లాడటంలో వెనుకబడతారు. పిల్లలు ఆరు నెలల వయస్సు ఉన్నప్పుడు 17 రకాల శబ్దాలను గుర్తించగలరు, ఇది ఏ రకమైన భాషనైనా నేర్చుకోవడంలో మరియు అర్థం చేసుకోవడంలో మరింత సహాయపడుతుంది. మీ పిల్లల్లొ స్పీచ్ డిలేని ఎలా గుర్తించాలి? 6 నెలల వయస్సున్నపుడు ఎక్కువగ శబ్దాలు చేయకపోవడం.. 12 నుంచి 18 నెలల లోపు తమ మొదటి పదాలు మాట్లాడటం ప్రారంభించకపోవడం.. పేరు పెట్టి దేనినీ అడగకపోవడం.. రెండు సంవత్సరాల …